Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రత్యేక హైప్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచింది. ఈ మూవీ మ్యూజిక్ హక్కుల కోసం టీ సిరీస్ ఏకంగా రూ.75 కోట్ల భారీ ఒప్పందం కుదుర్చుకుందనే సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం, టీ సిరీస్ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ రూ.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో ‘రామాయణం’ రెండు భాగాలకు సంబంధించిన మ్యూజిక్ హక్కులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలోనే చెల్లించినట్లు సమాచారం. దీంతో ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మ్యూజిక్ డీల్ గా ఈ మూవీ నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ డీల్ నిజమైతే పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ‘పుష్ప 2’ మ్యూజిక్ రైట్స్ సుమారు రూ.65 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో, ‘రామాయణం’ ఆ రికార్డును కూడా అధిగమించినట్టే అవుతుంది. సినిమా విడుదలకు ముందే ఇలాంటి భారీ వ్యాపారం జరగడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న మార్కెట్ నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీతమే హైలెట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆర్కెస్ట్రేషన్‌తో పాటు భారతీయ ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే సంగీతాన్ని అందించనున్నారని ఇప్పటికే చిత్రబృందం కూడా వెల్లడించింది. ఈ కారణంగానే మ్యూజిక్ రైట్స్ కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
మరోవైపు, సినిమా ప్రచారంలో కూడా మేకర్స్ వినూత్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు సాయంత్రం లేదా రాత్రి విడుదల చేస్తుంటారు. కానీ ‘రామాయణం’ ట్రైలర్‌ను జూలై 30న తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమైన ఉదయం 4:15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవిత్రమైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమాకు ఉన్న ఆధ్యాత్మిక భావనను ప్రేక్షకులకు మరింత బలంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు సన్నీ డియోల్, రవి దూబే వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ట్రైలర్‌కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్‌కు రూ.75 కోట్ల డీల్!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
-
NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.!
-
Hyderabad: మియాపూర్‌లో విషాదం..! ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.!
-
Sharwanand: ‘భోగి’ రఫ్ కట్కు శర్వానంద్ ఫుల్ సాటిస్ఫై.. సంపత్ నందికి మరో సినిమా గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!