Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: స్పెషల్ మార్నింగ్ షోలు.. ఏఏ థియేటర్లో అంటే..?

Svp

Svp

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. ఇక రిలీజ్ కు ఎంతో సమయంలేకపోవడంతో మహేష్ అభిమానులు రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అదనపు షో కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అందులోనూ తాజాగా చిత్ర యూనిట్ అభ్యర్థనతో స్పెషల్ మార్నింగ్ షోకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పటినుంచే థియేటర్స్ కు చేరుకోవడానికి రోడ్లపైకి వచ్చేశారు.

నాలుగు థియేటర్లలో 4:05 గంటల స్పెషల్ మార్నింగ్ షో కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవి ఏంటంటే.. భ్రమరాంబ ధియేటర్- కూకట్ పల్లి, మల్లికార్జున థియేటర్- కూకట్ పల్లి, విశ్వనాథ్ థియేటర్ – కూకట్ పల్లి, శ్రీ రాములు థియేటర్ – మూసాపేట్.. ఈ నాలుగు థియేటర్లలో 4:05 గంటలకు స్పెషల్ మార్నింగ్ షో పడనుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో రేపు చూడాలి.

Exit mobile version