NTV Telugu Site icon

Sai Pallavi: సైలెంటుగా సాయి పల్లవి పెళ్లి.. అసలు సంగతి చెప్పేసిన డైరెక్టర్

Sai Pallavi Marriage Photo Viral

Sai Pallavi Marriage Photo Viral

Truth Behind the Sai Pallavi Marriage News:తెలుగు ఆడియన్స్ సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఫిదా’ ద్వారా తెలుగు స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ కాలం గుర్తుండిపోయే క్యారెక్టర్లలో నటించి నటిగా తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. కొన్ని రోజులుగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. డాక్టర్ కోర్సు కూడా చేసిన ఆమె సమాజ సేవ చేసేందుకు హాస్పిటల్ పెట్టబోతోందని పుకార్లు వచ్చినా అది నిజం కాదని తెలుస్తోంది. ఇక అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో మెడలో దండలు వేసుకొని మరో వ్యక్తితో కలిసి ఉన్న ఆమె ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామిని ఆమె పెళ్లి చేసుకుందన్న కథనాలు వినిపించగా అందులో ఎటువంటి వాస్తవం లేదు.

Sai Pallavi: ‘చై’తో మరోసారి సాయి పల్లవి.. లేడీ లక్కు ఏం చేస్తుందో?

శివకార్తికేయన్‌తో కలిసి ఆమె నటిస్తున్న ‘#SK 21’ ముహూర్తం పూజ ఇటీవల నిర్వహించారు. ఆ పూజా కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి, సాయి పల్లవి మెడలో వేరువేరుగా పూల దండలు వేసుకొని ఉండగా మీడియాకు ఫొటో కోసం ఫోజులు ఇచ్చారు. ఇది అసలు పెళ్లి ఫొటో కాదని, సినిమా వేడుకలో తీసిందిని తాజాగా సాయి పల్లవితో విరాటపర్వం చేసిన దర్శకుడు వేణు కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక మరో పక్క సాయి పల్లవి ఈరోజే నాగచైతన్య 23 సినిమాలో కూడా భాగం అవుతుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Show comments