Site icon NTV Telugu

Tollywood : ట్రంప్ దెబ్బ.. టాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ముప్పు..

Trump

Trump

Tollywood : అసలే టాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతోంది. పెరిగిన టికెట్లు, థియేటర్లలో పాప్ కార్న్ రేట్ల వంటివి ఘోరమైన దెబ్బ కొట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశారు. అంతో ఇంతో యూఎస్ నుంచి మంచి ఇన్ కమ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు 30 శాతం ఇన్ కమ్ యూఎస్ నుంచే వస్తోంది. ఇలాంటి టైమ్ లో ట్రంప్ ఘోరమైన దెబ్బ కొట్టాడు. విదేశీ సినిమాలపై అమెరికాలో వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించాడు. వాస్తవానికి మే నెలలోనే ఈ టారిఫ్ లు విధిస్తున్నట్టు ప్రకటించాడు. కానీ అది అమల్లోకి రాలేదు.

Read Also : Kantara 1 : బాయ్ కాట్ కాంతార1 అంటున్న తెలుగు యూత్.. ఎవరూ పట్టించుకోరా

దీంతో మర్చిపోయాడేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి అదే ప్రకటన చేశాడు. రేపో మాపో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చేలా కనిపిస్తున్నాడు. దీంతో తెలుగు సినిమాలకే ఎక్కువ దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇండియా నుంచి తెలుగు సినిమాలే అమెరికాలో ఎక్కువగా ఆడుతుంటాయి. టాలీవుడ్ సినిమా టికెట్ రేట్లే చాలా ఎక్కువ. అందుకు తగ్గట్టే కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలైన మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, నాని లాంటి హీరోల సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు వంద శాతం సుంకాలు అంటే టికెట్ రేట్లు భారీగా పెరుగుతాయి. అప్పుడు అమెరికాలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా తెలుగు సినిమాలకు కలెక్షన్లు తగ్గుతాయి. త్వరలో రిలీజ్ కాబోయే పెద్ద సినిమాలపై ఈ ఎఫెక్ట్ బలంగా పడనుంది.

Read Also : Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్

Exit mobile version