NTV Telugu Site icon

TRP Rating: హిట్ అయిన ‘విక్రమ్’కి తక్కువ.. ప్లాఫ్ అయిన ‘బీస్ట్’కి ఎక్కువ!

Vikram

Vikram

TRP Rating: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ నటించిన ‘విక్రమ్’ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించిన ఈ సినిమా ఈ టీవీ ప్రీమియర్‌లో తక్కువ టిఆర్ పిని సాధించటం ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేటర్ ఆడియన్స్ మెప్పు పొందిన ఈ సినిమా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ ప్రపంచవ్యాప్తంగా 426 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా దీపావళి కానుకగా టీవీలో ప్రదర్శితమై 4.42 టిఆర్ పి సాధించింది. ఇదే సమయంలో ఇలయ దళపతి విజయ్ నటించిన ప్లాఫ్ మూవీ ‘బీస్ట్’ కూడా టెలివిజన్ లో ప్రదర్శితమైంది. అయితే ఇది 12.62 టిఆర్ పితో అగ్రస్థానంలో నిలవటం విశేషం. ఇదిలా ఉంటే అజిత్ నటించిన ‘విశ్వాసం’ టీవీల్లో 10వ సారి ప్రసారమై 10.27 టీఆర్పీ ని సాధించటం గమనార్హం.
దీపావళికి తమిళనాట టెలివిజన్ లో ప్రదర్శితమైన సినిమాల టీఆర్పీ వివరాలు
బీస్ట్ – 12.62 (ప్రీమియర్)
విశ్వాసం – 10.27 (10వ సారి)
అరుణాచలం – 9.21 (లెక్కలేదు)
విక్రమ్ – 4.42 (ప్రీమియర్)
డాన్ – 3.63 (ప్రీమియర్)
ఇదిలా ఉంటే కమల్ హాసన్ పుట్టినరోజున ‘విక్రమ్’ చిత్రం శతదినోత్సవ వేడుక జరపనున్నారు. ఈ మేరకు చిత్రాన్ని నిర్మించిన కమల్ రాజ్ కమల్ ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు చెన్నై లోని కలైవానర్ అరంగంలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి.