NTV Telugu Site icon

Sharma Sisters: విప్పి చూపించడమే.. ఏం లేదు అక్కడ

Neha

Neha

Sharma Sisters: బాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో శర్మ సిస్టర్స్ తెలియని వారుండరు.. అరెరే మాకు తెలియదే ఎవరు వారు అని అంటారా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ గుర్తుందా..? హా ఆమె శర్మ ముద్దుగుమ్మ.. ఇక ఆమె చెల్లి ఐషా శర్మ. వీరి గురించి, వీరి అందాల ఆరబోత గురించి తెలియాలంటే వారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడాల్సిందే. చిరుత తరువాత టాలీవుడ్ లో నేహాకు అంతగా కలిసిరాలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కనిపించినా అక్కడా పెద్ద ప్రయోజనం లేదు. దీంతో ఈ అక్కాచెల్లెళ్లు.. సోషల్ మీడియాను హీటెక్కించడమే పనిగా పెట్టుకున్నారు. వర్క్ అవుట్స్, హాట్ ఫోటోషూట్స్, ఈవెంట్స్, మాల్దీవ్ వెకేషన్స్.. రోజువారీ ఈ సిస్టర్స్ పని ఇదే. హిట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును రెచ్చగొట్టడం ఈ శర్మ సిస్టర్స్ కు వెన్నతో పెట్టిన విద్య.

Urfi Javed: ఛీ ఛీ.. చూపించడానికి నీకు సిగ్గు లేదు.. ఫ్యాషన్ మీదనే విరక్తోస్తోంది

బాత్, బెడ్, సన్, మూన్, ఇన్ సైడ్, అవుట్ సైడ్.. ఒకటి అని లేదు.. ఎక్కడ ఏ యాంగిల్ లో ఎలాంటి పోజ్ పెడితే కెమెరా కంటికి అందాల ఆరబోత కనిపిస్తోందో వీరికి బాగా తెలుసు. అక్కకు తోడు చెల్లి.. నిజం చెప్పాలంటే అక్కను మించి చెల్లి. అక్క నేహా అయినా కొద్దోగొప్పో అందాల ఆరబోతకు కట్టడి పెడుతుంది.. చెల్లి ఐషా అయితే అసలు ఆనకట్టలే ఉండవు. ఎద అందాలను ఆరబోయడంలో అమ్మడు స్పెషలిస్ట్. అక్క అయినా కొన్ని సినిమాల్లో కనిపించింది. చెల్లి అసలు సినిమాలు పక్కన పెట్టి ఫోటోషూట్స్ కే పరిమితమయ్యింది. ప్రస్తుతం ఈ సిస్టర్స్ గురించి బాలీవుడ్ పెద్ద చర్చనే జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మలు.. అందాల ఆరబోతతోనే సంపాదిస్తున్నారు. విప్పి చూపించడమే.. సినిమాలు ఏమి లేవక్కడ.. అసలు సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందో లేదో కూడా తెలియదు అన్నట్లు ఉన్నారు. దీంతో ట్రోలర్స్ సినిమాలు చేసేదేమైనా ఉందా..? ఇలాగే చూపిస్తూ తిరుగుతారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు అయితే నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Show comments