Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ ఈ సినిమా తరువాత భవదీయుడు భగత్ సింగ్ ను మొదలు పెట్టనున్నాడు. ఇక దీని తరువాత సురేందర్ రెడ్డి, దాని తరువాత సుజిత్ సినిమా. They Call Him #OG అంటూ క్యాప్షన్ పెట్టి సినిమాపై అంచనాలను పెంచేశారు. జపాన్ భాషలో ఫైర్ స్ట్రోమింగ్ కమింగ్ అని రాయడం, పవన్ షాడో లో గన్ కనిపించడంతో అసలు సినిమా కథ ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాపై ట్రోల్స్ ను మొదలుపెట్టారు ట్రోలర్స్.. సినిమాలు ఒప్పుకోవడమేనా.. చేసేది ఏమైనా ఉందా అని ట్రోల్స్ చేస్తున్నారు. ముందు ఉన్న మూడు సినిమాలు పూర్తిచేసి ఈ నాలుగో సినిమాను మొదలుపెట్టమని చెప్పండి అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా అనుకున్నా సుజిత్ వంతు వచ్చేసరికి నాలుగేళ్లు పడుతుందని చెప్పుకొస్తున్నారు. మధ్యలో ఎన్నికలు వస్తున్నాయి. సినిమాలు వదిలేసి రాజకీయాలపై ఫోకస్ పెడితే వీరి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.