NTV Telugu Site icon

NTR: ఎన్టీఆర్ పై ఎందుకింత నెగెటివిటీ.. ?

Ntr

Ntr

NTR: నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. అంచలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఒక హీరో అన్నాకా.. అభిమానులు ఉంటారు.. ట్రోలర్స్ ఉంటారు. ఎన్టీఆర్ విషయంలో కూడా అంతే.. ఆయనకు ఎంతమంది అభిమానులు అయితే ఉన్నారో.. అంతే ట్రోలర్స్ కూడా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అంటే గిట్టనివాళ్ళు సోషల్ మీడియా లో చాలామందే ఉన్నారు. ప్రతి చిన్నవిషయాన్ని భూతద్దంలో చూపిస్తూ ఎన్టీఆర్ పై నెగెటివిటీని పెంచేస్తున్నారు. మొన్నటికి మొన్న తారకరత్న మృతి సమయంలో ట్రోల్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుకలప్పుడు ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల విషయంలో ఎన్టీఆర్ ను ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. మే 28 న పెద్ద ఎన్టీఆర్ శతజయంతి కావడంతో వారం ముందు నుంచే ఈ వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ మధ్యనే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. అతిరథ మహారథుల ఈ వేడుకకు హాజరయ్యారు.

ఎన్టీఆర్ తో నటించిన నటుల నుంచి కుర్ర హీరోలు రామ్ చరణ్, నాగ చైతన్య, సిద్దు జొన్నలగడ్డ వరకు అందరు హాజరయ్యి ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు. అయితే.. ఇంతమంది వచ్చినా.. మనవడు ఎన్టీఆర్ రాలేదని ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ వేడుకకు రాలేనని, తన కుటుంబంతో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నట్లు ఆరోజు చెప్పాడు. అయితే ఇదే మాట.. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే చెప్పి ఉండొచ్చుగా.. వేడుకకు రాలేక ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఇన్విటేషన్ తీసుకున్న రోజునే తాను రాలేనని చెప్పుకొచ్చాడట.. కానీ, వేడుకకు ప్రమోషన్స్ కోసం శ్రేయాస్ మీడియా వారు ఎన్టీఆర్ ఫోటోను వాడుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్నీ అర్ధం చేసుకొని ట్రోలర్స్.. ఇంకా ఎన్టీఆర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. కావాలనే చాలామంది ఎన్టీఆర్ పై నెగెటివిటిని స్ప్రెడ్ చేస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతగా తారక్ ఏం చేశాడు.. అతడిపై ఎందుకు అంత నెగెటివిటి అని తారక్ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఈ ట్రోలింగ్ ఆపాలని కోరుతున్నారు.

Show comments