Macharla Niyojakavargam: కమ్మ, కాపు కులస్థులపై బూతులు.. వివాదంలో నితిన్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Macharla Niyojakavargam: యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజక వర్గం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా అంజలి నటించిన ఐటెం సాంగ్ రారా రెడ్డి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన దర్శకుడు.. తాజాగా ఈ సినిమా వివాదంలోకి వెళ్లడానికి కారణమయ్యాడు. అవును మాచరల్ నియోజకవర్గం వివాదంలో చిక్కుకొంది. కొన్నేళ్ల క్రితం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ట్వీట్ చేసిన కొన్ని ట్వీట్ల ప్రభావం ఈ సినిమాపై పడ్డాయి. దర్శకుడు.. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచినా వెంటనే.. కమ్మ, కాపు కులస్థులను బూతులు తిడుతూ ట్వీట్స్ చేశాడు.
ఒక సినీ సెలబ్రిటీ ఈ రేంజ్ లో ట్వీట్స్ పెడతాడని ఎవరు ఊహించరు. ఆ ఒక్కటే కాకుండా టీడీపీని కించపరిచేలా రెడ్డిలను పొగుడుతూ రాజశేఖర్ అకౌంట్ లో చాలా ట్వీట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కూడా హీరోకు రెడ్డి అని పేరు తగిలించి, రారా రెడ్డి అనే సాంగ్ పెట్టి.. కేవలం రెడ్డి కులస్థులను మాత్రమే పొగుడుతూ మిగతావారిని కించపరుస్తునట్లు చూపిస్తున్నాడని, అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ #Banmacharlaniyojakavargam ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకొన్ని రోజులో రిలీజ్ పెట్టుకొని ఈ వివాదం నితిన్ మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది. దీంతో ఏకంగా నితినే రంగంలోకి దిగాడు. అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని, ఎవరో కావాలనే ఈ ట్వీట్స్ చేస్తున్నారని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని ఆధారాలతో సహా చెప్పుకొచ్చాడు. మరోపక్క డైరెక్టర్ రాజశేఖర్ కూడా అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని చెప్పడానికి ట్రై చేశాడు. ఆ స్క్రీన్ షాట్స్ లో ఉన్న పేరు, తన పేరు వేరని, తాను జగన్ అభిమాని అన్న మాట వాస్తవమే కానీ వేరే కులస్థులను కించపర్చలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి కమ్మ, కుల రాజకీయాల ప్రభావం మాచర్ల నియోజకవర్గం సినిమాపై పడనుందా..? లేదా..? అనేది చూడాలి.
Also Read
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
Fake tweet by a Fake person has created unnecessary fuss.. unfortunately this has hurt the sentiment of others..VERY SAD and DISAPPOINTING 🙏🙏🙏 I CONDEMN this kind of FALSE PROPAGANDA… https://t.co/OWCHyvwAEB
— nithiin (@actor_nithiin) July 26, 2022
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!