Site icon NTV Telugu

Trivikram: భార్యకు ప్రేమతో.. లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు

Trivikram

Trivikram

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ భార్య సౌజన్య సైతం నిర్మాతగా వ్యహరిస్తోంది. అంతేకాకుండా ఆమె ఒక భరతనాట్య కళాకారిణి. ఎప్పుడో కానీ ఈ జంట బయట కనిపించరు. ఇక తాజాగా భార్యకు, త్రివిక్రమ్ భారీ బహుమతిని అందించాడు. ఖరీదైన బీఎండబ్ల్యూ కారును సౌజన్యకు గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే ఈ కారు ధర రూ. 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏదో సెప్షల్ అకేషన్ కే త్రివిక్రమ్ ఈ కారును బహుమతిగా ఇచ్చి ఉంటాడని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే త్రివిక్రమ్ మహేష్ సినిమా తరువాత బన్నీతో మరో సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమా ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Exit mobile version