OG : మొత్తానికి ఓజీతో పవన్ కు హిట్ పడింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సుజీత్ వల్లే తమకు హిట్ పడింది అంటూ మోసేస్తున్నారు. పైగా తాము పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలి అనుకున్నామో.. అచ్చం అలాగే చూపించాడని కల్ట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ టైమ్ లో త్రివిక్రమ్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వల్లే సుజీత్-పవన్ కల్యాణ్ కాంబోలో ఓజీ సినిమా ఖాయం అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సలహాతోనే పవన్ కల్యాణ్ సుజీత్ తో సినిమా చేశాడు. సుజీత్ సాహో సినిమా తర్వాత త్రివిక్రమ్ సుజీత్ గురించి తెలుసుకుని.. పవన్ కల్యాణ్ తో మాట్లాడాడు.
Read Also : Saipallavi : బికినీ ఫొటోలపై స్పందించిన సాయిపల్లవి.. ఏమన్నదంటే..?
సుజీత్ తో సినిమా చేస్తే బాగుంటుందని చెప్పడంతో కథ విని ఓకే చెప్పాడు పవన్. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య స్వయంగా తెలిపారు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ కు అందరూ స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. గతంలోనూ త్రివిక్రమ్ సలహాలతో పవన్ కొన్ని సినిమాలు చేశాడు. అందులో వకీల్ సాబ్ మంచి హిట్ అయింది. కానీ భీమ్లానాయక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక బ్రో సినిమాలోనూ త్రివిక్రమ్ హస్తం ఉందనేది వాస్తవం. అవేవీ అనుకున్న రేంజ్ లో పవన్ ను ఎలివేట్ చేయలేదు. కానీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ సలహా పవన్ కు హిట్ తెచ్చిపెట్టిందంటున్నారు అభిమానులు. అందుకే ఆయనకు ఈ విషయంలో థాంక్స్ అనేస్తున్నారు.
Read Also : OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
