Site icon NTV Telugu

Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ – వెంకటేశ్‌ హిట్ కలయికకు మరో స్టార్ హీరోయిన్‌!

Venkatesh, Trivikram

Venkatesh, Trivikram

టాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో  ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి వెంకటేశ్‌ సినిమాలకు రచయితగా పనిచేసి తన స్టోరీ టచ్‌తో పెద్ద విజయాలు సాధించారు. అందుకే ఈ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా పై మరింత కుతూహలం నెలకొంది.

Also Read : Chiranjeevi Deepfake Case: AI మార్ఫింగ్ షాక్‌ – చిరంజీవిపై అశ్లీల వీడియోలు వైరల్!

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైనట్లు సమాచారం. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్‌ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ కూడా భాగమవబోతుందట. ఆమె మరెవరో కాదు ప్రతిభావంతురాలు ఐశ్వర్య రాజేష్. గతంలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా కనిపించారు. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగా నచ్చడంతో త్రివిక్రమ్‌ మళ్లీ ఈ జంటను తెరపై చూపించాలని నిర్ణయించారట. ఇక ఈ సారి త్రివిక్రమ్‌ పెన్‌ పవర్‌, వెంకీ ఎమోషనల్‌ యాక్టింగ్‌ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ సర్కిల్స్‌ అభిప్రాయం.ఇది వెంకటేశ్‌ కెరీర్‌లో 77వ సినిమాగా రాబోతుంది. ప్రస్తుతం టైటిల్‌ ఫైనల్‌ కాలేదు కానీ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ కలయికతో వస్తున్న ఈ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version