Trivikram Srinivas : త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దివంగత రచయిత సినివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సిరివెన్నల గురించి బహుషా త్రివిక్రమ్ చెప్పినంతగా ఎవరూ చెప్పి ఉండరేమో. తాజాగా మరోసారి సిరివెన్నల గురించి కామెంట్ చేశారు త్రివిక్రమ్. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పాటలు పెద్దగా నచ్చేవి కావు. అలాంటి టైమ్ లో సిరివెన్నల సినిమాలోని ‘విధాత తలపున’ సాంగ్ విని మైండ్ బ్లాంక్ అయింది. ఆ పాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అందులోని పదాలకు అర్థం వెతకడం కోసం డిక్షనరీ తిరిగేశాను. తెలుగు పదాలకు కూడా డిక్షనరీ ఉంటుందని అప్పుడే తెలిసింది నాకు.
Read Also : Nani : నాని పాన్ ఇండియా ప్రయత్నాలు మళ్ళీ వృథా?
ఆ పాట తర్వాత సిరివెన్నల గారు రాసిన పాటలు ఎందుకో అంత గొప్పగా అనిపించలేదు. ఇప్పటికీ ఆయన రాసిన పాటల్లో నాకు సిరివెన్నల సినిమాలోని విధాత తలపున గొప్పదిగా అనిపిస్తుంది. కానీ అన్ని సార్లు ఆయన అలాంటి పాటలే రాయలేరు కదా. సినిమాలకు తగ్గట్టు పాటలు రాయాలి. అందరికీ అర్థం అయ్యేలా పాటలు రాయడానికి ఎన్నో తేలికైన పదాలు వాడటం స్టార్ట్ చేశారు. నా సినిమాల్లోని సీన్లకు ఒక్కోసారి చాలా వెర్షన్లు రాసేవారు. జల్సా సినిమాలోని ఛలోరే ఛలోరే ఛల్ అనే పాటకు 30 వెర్షన్లు రాశారు. అందులో నేను రెండు మాత్రమే తీసుకున్నా. ఆయన అన్ని పాటలను ఒకేలా చూస్తారు. ప్రేక్షకులకు నచ్చేలా రాయడమే ఆయన గొప్పతనం’ అంటూ చెప్పుకొచ్చారు త్రివిక్రమ్.
Read Also :Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్ ను వాడేసిన ఢిల్లీ టీమ్.. చరణ్ ఏమన్నాడంటే..?
