NTV Telugu Site icon

Trivikram: అప్పుడున్న గురూజీ వేరు.. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు

Trivikram

Trivikram

Trivikram: నిజమే.. ఇప్పుడు మనం చూస్తున్న త్రివిక్రమ్.. త్రివిక్రమ్ కాదు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు, రాసిన కథలు, చెప్పిన డైలాగులు. నిజం చెప్పాలంటే.. ఒక డైరెక్టర్ కు అభిమానులు ఉండడం అనేది గురూజీ దగ్గర నుంచే మొదలయ్యింది. సినిమాలో ఆయన చెప్పే జీవిత సత్యాలు.. స్టేజిమీద ఆయన ఇచ్చే స్పీచ్ లు.. ఎంతోమంది కుర్రకారును ఇన్స్పైర్ చేశాయి అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఆ గురూజీ కనిపించడం లేదు. ఆయన కథల్లో జీవం లేదని చెప్పుకొస్తున్నారు. ఎప్పుడెప్పుడు గురూజీ సినిమా వస్తుందా.. ? అని ఎదురుచూసే ఫ్యాన్స్ ఇప్పుడు ఎలాంటి కథలు రాస్తున్నాడో అని భయపడుతున్నారు. ఒకప్పుడు ఆయన రాసిన కథలు గురించి చెప్పాలంటే.. ఒక స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు.. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి మూవీ నువ్వే నువ్వే.. బ్లాక్ బస్టర్ హిట్.

కన్నకూతురు కోసం ఏదైనా చేసే ఒక తండ్రి.. ఆమె ప్రేమించిన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. అది కూడా తండ్రి ప్రేమనే.. ఎందుకంటే.. ఎక్కడ తన కూతురు తనను వదిలి వెళ్లిపోతుందేమో అన్న భయం. తన కూతురును తనకన్నా ఎక్కువ ప్రేమించే అబ్బాయిని చూసి ఈర్ష్య. తనకన్నా తన కూతురును ఎవరు ప్రేమించుకూడదు అనే ప్రేమ పట్టుదలను ఎంతో అందంగా చూపించాడు. తరుణ్, శ్రేయ జంటగా నటించిన ఈ చిత్రం 2002 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సాంగ్స్, కామెడీ, తండ్రీకూతుళ్ల ప్రేమ, ఎమోషన్స్.. అన్ని కలగలిపిన పర్ఫెక్ట్ సినిమా నువ్వే నువ్వే. అసలు ఈ ఒక్క సినిమా గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే..ఈ సినిమా షూటింగ్ లో తీసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తరుణ్, సునీల్, ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ ను ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక ఆ సీన్ ను త్రివిక్రమ్, వారికి వివరిస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో త్రివిక్రమ్.. కళ్ళజోడు పెట్టుకొని.. ఫుల్ హెయిర్ తో టైడ్ అయినవాడిలా కనిపిస్తున్నాడు. మొదటి సినిమాకు డైరెక్టర్ ఆ మాత్రం టైడ్ నెస్ ఉండాలి. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. అప్పుడున్న గురూజీని గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడున్న గురూజీ వేరు.. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు అని చెప్పుకొస్తున్నారు. మరి వింటేజ్ త్రివిక్రమ్ మళ్లీ వస్తాడేమో చూడాలి.

Show comments