NTV Telugu Site icon

SSMB 28: పైడి, పూడి, పెట్ల కాదు అక్కడ ఉన్నది గురూజీ…

Ssmb 28

Ssmb 28

టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మహేశ్ బాబు అసలు మహేశ్ బాబునే కాదు. స్టైల్ గా, చొక్కా నలగకుండా, జుట్టు చెదరకుండా, మెసేజ్ ఇస్తూ సినిమాలు చెయ్యడం కొత్త మహేశ్ బాబు స్టైల్ ఏమో కానీ టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, ఖలేజ, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ సినిమాలు చూస్తే తెలుస్తుంది అసలు మహేశ్ బాబు అంటే ఏంటో. మాస్ అనే పదానికే మరోపేరులా ఉంటాడు మహేశ్ బాబు.

మాస్ అంటే చొక్కాలు చించుకోవడం, రక్తాలు చిందించడం, గట్టిగట్టిగా అరవడాలు కాదు మహేశ్ మాస్ అదో రకం. ఘట్టమనేని అభిమానుల్లో పాతికేళ్లు వయసు దాటిన వారిని అడిగితే చెప్తారు ఆ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుందో. ఆ పాత వింటేజ్ మహేశ్ బాబుని చూపిస్తాం అని ఈ మధ్య కాలంలో మహేశ్ తో సినిమా చేసిన ప్రతి దర్శకుడు చెప్పిన వాడే. అనీల్ రావిపూడి, పరసురామ్ పెట్ల, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు మహేశ్ కి హిట్స్ ఇచ్చారు కానీ ఘట్టమనేని అభిమానులు కోరుకునే ఒక్కడు లాంటి ‘అర్జున్’ని, అతడు లాంటి ‘నందు’ని, పోకిరి లాంటి ‘పండు’ని, బిజినెస్ మాన్ లాంటి ‘సూర్య భాయ్’ని ఇవ్వలేకపోయారు. అందుకే మహేశ్ ఎంత పెద్ద హిట్స్ ఇచ్చినా ఘట్టమనేని అభిమానుల్లో చిన్న డిజప్పాయింట్మెంట్ ఉంటుంది. ఆ ఫీలింగ్ కి ఎండ్ కార్డ్ వేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ బాబుతో వస్తున్నాడు. SSMB 28 ఫస్ట్ లుక్ తో ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పేశాడు త్రివిక్రమ్.

మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అవి ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ఆడలేదేమో కానీ మహేశ్ ని త్రివిక్రమ్ చూపించినట్లు ఎవరూ చూపించలేకపోయారు. పెను తుఫాను తలొంచి చూసే తొలినిప్పుకణం అతడే, దైవం మానుష్య రూపేణా అంటూ మహేశ్ బాబుని నెవర్ బిఫోర్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేశాడు త్రివిక్రమ్. మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యడానికి, మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించడానికి SSMB 28 సినిమాని రూపొందిస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఈ హీరో-డైరెక్టర్ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో తెలియాలి అంటే 2024 జనవరి వరకూ ఆగాలి. ఇదిలా ఉంటే SSMB 28 ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఈ మూవీ నుంచి నెక్స్ట్ అప్డేట్ సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టిన రోజున అంటే మే 31న వస్తుంది అంటూ చెప్పేశాడు. ఆరోజు ఘట్టమనేని అభిమానులకి SSMB 28 నుంచి ఎలాంటి విజువల్ ట్రీట్ వస్తుందో చూడాలి.

Show comments