NTV Telugu Site icon

Trivikram: సందు దొరికినప్పుడల్లా.. ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ..?

Trivikram

Trivikram

Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ కెరీర్ మొదట్లో పాటల రచయితగా కూడా పనిచేశాడు. రవితేజ, నమిత జంటగా నటించిన ఒక రాజు.. ఒక రాణి సినిమాకు త్రివిక్రమ్ పాటలు రాశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. పాటలు మాత్రం ఆకట్టుకున్నాయి. ఇక దీని తరువాత త్రివిక్రమ్ కు మాటల రచయితగా పేరు రావడం.. డైరెక్టర్ గా మారడం చకచకా జరిగిపోయాయి.

Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయింది..?

ఇక డైరెక్టర్ అయ్యాకా కూడా త్రివిక్రమ్ అప్పుడప్పుడు పాటలు రాస్తూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా తూటాలాంటి మాటలను పదాలుగా మార్చి స్టార్ హీరోలకు ఎలివేషన్స్ ఇచ్చే సాంగ్స్ రాయడంలో త్రివిక్రమ్ దిట్ట. భీమ్లా నాయక్ లో లాలా భీమ్లా సాంగ్ ను రాసింది త్రివిక్రమే . ఇక ఇప్పుడు గుంటూరు కారం టైటిల్ రరివీల్ లో వచ్చే సాంగ్ ను కూడా త్రివిక్రమే రాశాడని టాక్ నడుస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుపదునైన పదాలను అందించి.. పాట రూపంలో మార్చి.. అభిమానులకు కిక్ ఇస్తున్నాడు. ఇలా సందు దొరికినప్పుడల్లా పాటల రచయితగా మారి.. తనలోని కోరికను నెరవేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఈ సినిమాతో మహేష్ కు హ్యాట్రిక్ హిట్ ను అందిస్తాడో లేదో చూడాలి.