Trisha: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో ఇప్పటికీ కొలువై కూర్చున్న బ్యూటీ త్రిష. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయింది త్రిష. అమ్మడి వయసు 39.. ఇప్పటికీ అదే అందం.. ఈ చెక్కు చెదరని అందంతోనే కుర్రాళ్ల మనసులను కుదిపేస్తోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. ఇక త్రిష పెళ్లి.. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సంగతి తెల్సిందే. కొన్ని కారణాల వలన ఆమె ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకొంది. ఆ తరువాత ఇప్పటివరకు ఈ చెన్నై చిన్నది పెళ్లి గురించిన ఊసే ఎత్తడం లేదు.
కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా త్రిష చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్, రంగి వంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే త్రిష .. నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను గిలిగింతలు పెడుతోంది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ అండ్ ఏళ్ళు మిక్సింగ్ డ్రెస్ లో త్రిష అందం వర్ణించడం కష్టమనే చెప్పాలి. ఇంట అందాన్ని మేము ఎప్పుడు చూడలేదని కొందరు.. ఇంతందం మెయింటైన్ చేస్తున్నావ్ సరే.. పెళ్ళెప్పుడు..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
