Site icon NTV Telugu

Trisha: స్వర్గం నుంచి దిగివచ్చావా.. నిత్యం అమృతమేమైనా తాగుతున్నావా..?

Trisha

Trisha

Trisha: అందం, అభినయం కలబోసిన రూపం ఆమెది. టాలీవుడ్, కోలీవుడ్ లో ఆమె తెలియని వారుండరు.. ఆమె అందానికి ముగ్దులు కానివారుండరు. ఆమె నవ్వితే నవరత్నాలు రాలతాయా..? అన్నంత అందంగా ఉంటుంది. ఆమెను చూస్తే ఏ దేవకన్య తప్పిపోయి భువికి దిగివచ్చిందా అన్నట్లు ఉంటుంది.. ఏ మాకు ఇంత ఇంట్రడక్షన్ అవసరం లేదు.. ఆ దేవత ఎవరో కాదు త్రిషనే అంటారా..? అవును. ఆ అందం త్రిషనే. వర్షం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అనంతరం.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ బహుబలి పొన్నియిన్ సెల్వన్ 2 లో కనిపించనుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువరాణి కుంధవి దేవిగా అవతరమెత్తింది. ఆ రోజుల్లో రాణుల కోసం యుద్దాలు చేసేవారని వినివుంటాం. కానీ,అంతకు మించిన అందం త్రిషలో ఉంది అంటే అతిశయోక్తి లేదు. ఆమె ధరించిన ఆభరణాలు, చీరలు.. ఆమె నటన.. ఆమె అందం ఇప్పటికీ ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి.

Sai Dharam Tej: మెగా ఫ్యామిలీని బాగా వాడేశా.. అందుకే ఎన్టీఆర్ తో

ఇక తాజాగా పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ లో కూడా త్రిష తనదైన నటనతో ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తంలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అంటే త్రిష అనే చెప్పాలి. బ్లూ కలర్ డ్రెస్ లో త్రిష అందం ముందు ఎవ్వరైనా దిగదుడుపే అని చెప్పాలి. ఆమె ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు.. ఏ మాయ చేశావే.. అంటూ మొదలుపెట్టి.. స్వర్గం నుంచి దిగివచ్చావా దేవకన్య అంటూ మైమరిచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇంత యవ్వనంగా ఉండడానికి నువ్వేమైనా అమృతం తాగుతున్నావా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version