Tripti Dimri : రణ్‍బీర్ వైపు అందుకే అలా చూసాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో, సందీప్ రెడ్డి వంగా కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రంలో రణ్ బీర్ సరసన రష్మిక మందన్న, తృప్తి డిమ్రి హీరోయిన్ లు గా నటించారు. అయితే యానిమల్ మూవీ తో యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఫేట్ మారిపోయింది. ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో కనిపించింది కాసేపే అయినా తృప్తికి మాత్రం బాగా పేరొచ్చింది. హీరో రణ్‍బీర్ కపూర్‌తో తృప్తి డిమ్రి.. ఇంటిమేట్ సీన్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. తృప్తి అందం, నటన ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. దీంతో నేషనల్ క్రష్ అంటూ తృప్తికి పేరు పెట్టేశారు. అయితే, ఓ ఈవెంట్‍లో హీరో రణ్‍బీర్ కపూర్‌నే తృప్తి తదేకంగా అలాగే చూశారు. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో, ఆ వీడియోపై తృప్తి తాజాగా స్పందించారు.ఇటీవల యానిమల్ మూవీ స్క్రీనింగ్‍కు రణ్‍బీర్, తృప్తి డిమ్రి సహా మూవీ యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
అయితే, అప్పుడు ఫొటో షూట్ కోసం వేదిక దగ్గరికి వచ్చారు. అయితే, ఆ సమయంలోనే తన ముందు అటూ ఇటూ తిరిగిన రణ్‍బీర్‌నే తృప్తి చూస్తూ వున్నారు. అతడు ఎటు వెళితే అటే చూశారు. దీంతో రణ్‍బీర్ నుంచి తృప్తి చూపుతిప్పుకోలేకపోతున్నారని, ఆమె ప్రేమలో పడినట్టున్నారని చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఉందంటూ కూడా గాసిప్స్ రాసుకొస్తున్నారు. ఈ వీడియో కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో గురించి తృప్తి డిమ్రి మాట్లాడారు.ఎవరైనా మన ముందు ఉండి.. ఇతరులతో మాట్లాడుతుంటే ఆ వ్యక్తినే చూస్తాం కదా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి తెలిపారు.. మాములుగానే రణ్‍బీర్‌ను తాను అలా చూసానని ఆమె చెప్పారు. ఆ రోజు తాను చాలా కంగారుగా ఉన్నానని కూడా తృప్తి తెలిపారు.మేం స్క్రీనింగ్ దగ్గర ఉన్నాం. నటీనటులందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చి ఫొటోలు షూట్ చేయాలని అకున్నారు. అందరినీ ఒకచోటికి రమ్మన్నారు. అప్పుడు అక్కడి వారు మాట్లాడుతున్నారు. రణ్‍బీర్ కపూర్ నా ముందే నిలబడి ఎవరితోనే మాట్లాడుతున్నారు. మన ముందు ఎవరైనా నిలబడి మరెవరితోనో మాట్లాడుతుంటే.. సాధారణంగా వారి వైపే చూస్తాం కదా అని తృప్తి డిమ్రి తెలిపారు.
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
Visual Representation Of Why Tripti Signed a Small Role In #AnimalTheMovie.
Ok, but there will be very important role of her in second part #AnimalPark #TriptiDimri #RanbirKaapor pic.twitter.com/7fH5lUkRag— Ayan Sanger (@i_ranbirfan) December 7, 2023
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!