Site icon NTV Telugu

TrinadhaRao Nakkina : ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు.. త్రినాథరావు నక్కిన ఆవేదన..

Trinatha Rao

Trinatha Rao

TrinadhaRao Nakkina :ట్యాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటారు. ఆయన చేసే కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతాయి. మొన్న ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న మూవీ చౌర్య పాఠం. నిఖిల్ గొల్లమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఇంద్రరామ్‌ హీరోగా, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్ గా చేస్తున్నారు. ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు ఎమోషనల్ అయ్యారు. ‘ఇప్పుడు సినిమాల పరిస్థితి దారుణంగా మారింది. జనాలు థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను ఏపీలో షూటింగ్ చేసే టైమ్ లో చాలా థియేటర్లు తిరిగాను. అక్కడ ఎవరూ కనిపించట్లేదు. సెకండ్ షోలు క్యాన్సిల్ చేసేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు త్రినాథరావు.
Read Also : Shine Tom Chacko: వీక్ క్యారెక్టర్స్‌తో కెరీర్ డౌన్ చేసుకుంటున్న యాక్టర్

‘స్టార్ హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకులు రావట్లేదు. ఇక కొత్త వారితో సినిమా అంటేనే భయమేస్తోంది. అసలు ఎవరైనా వస్తారా రారా అనే అనుమానం ఉంటుంది. ఆ భయంతోనే సినిమాలను తీస్తున్నాం. ఇప్పుడు ఈ మూవీని ఊడా ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ పోటీ ఉందని 25కు రిలీజ్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్నదంతా సినిమాకు పెట్టేశాను. సినిమాకు భారీగా ఖర్చు చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లలేను. నా సినిమా కంటెంట్ మీదనే నమ్మకం ఉంచుతున్నాను. ఈ సినిమాను ఆదరించండి’ అంటూ చెప్పుకొచ్చాడు త్రినాథరావు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్అవుతున్నాయి. ఇక చౌర్య పాఠం ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంటోంది. ఒక బ్యాంక్ రాబరీ నేపథ్యంలో కామెడీ ట్రాక్ లో మూవీని తీస్తున్నారు.

Exit mobile version