NTV Telugu Site icon

Nakkina Trinadh Rao: దర్శకుడు నక్కిన త్రినాధరావు ఇంట తీవ్ర విషాదం

Trinadha Rao Nakkina Father

Trinadha Rao Nakkina Father

Trinadh Rao Nakkina Father Surya Rao Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ దర్శకుడు, ఇటీవల నిర్మాతగా మారిన త్రినాధరావు నక్కిన ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి లోనే పుట్టి పెరిగిన త్రినాధరావు నక్కిన చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నాడు. జాబ్ చేసే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చిన ఆయన దర్శకత్వం మీద మక్కువతో సినీ రంగానికి దగ్గరయి 2013లో ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే ఆ తరువాత మరో రెండు సినిమాలు చేసినా రాజ్ తరుణ్ తో చేసిన సినిమా చూపిస్త మామ సినిమాతో మొదటి హిట్ అందుకున్న ఆయన నేను లోకల్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.

Rashmika Deep Fake Video : రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఢిల్లీ పోలీసులు

ఆ తర్వాత హలో గురు ప్రేమకోసమే అనే సినిమా చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరిగా ధమాకా అనే సినిమాతో ఆయన సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే ఒక పీరియాడిక్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. త్రినాథ్ రావు నక్కిన కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమాగా చెబుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు సైతం నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా త్రినాధరావు నక్కిన తండ్రి కన్నుమూశారు. తండ్రి నక్కిన సూర్య రావు నిన్న రాత్రి అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. వారి స్వగ్రామంలోనే అంత్యక్రియలు చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.

Show comments