NTV Telugu Site icon

Harish Shakar: ‘కిరాయి’కి రెడీ అంటున్న త్రిగుణ్!

New Project (1)

New Project (1)

 

యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇటీవల త్రిగుణ్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈ యేడాదిలో ఇప్పటికే అతను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్లూ’, కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్‌ నటించిన ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఇందులో రాజకీయ నాయకుడు కొండా మురళీగా త్రిగుణ్ నటించాడు. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే చిత్రంలోనూ త్రిగుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మధుదీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇవాళ (జూన్ 8) త్రిగుణ్ బర్త్ డే సందర్బంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. అలానే అతని లేటెస్ట్ మూవీ ‘కిరాయి’ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. దీనిని ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్ ఆవిష్కరించడం విశేషం. ఈ క్రైమ్ డ్రామాను వి.ఆర్.కె. దర్శకత్వంలో నవీన్ రెడ్డి, అమూల్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరిగౌర సంగీతం అందిస్తున్నారు. త్రిగుణ్ ఈ మూవీలో మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు తెలిసిందని, ఈ సినిమా కథ విన్న తర్వాత చూడాలనే ఆసక్తి కలిగిందని హరీశ్‌ శంకర్ తెలిపారు.

చిత్ర దర్శకుడు వి.ఆర్.కె. (రామకృష్ణ) మాట్లాడుతూ, ”గుంటూరు, పల్నాడులో ఒకప్పుడు ఎక్కువగా హత్యలు జరిగేవి. దాని ఆధారంగా మేము గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాం. ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది? ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు? ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేదే ఈ కథ. ఇందులో హీరోగా నటించిన త్రిగున్ కు మంచి బ్రేక్ వస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా రష్ అండ్ ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్ ఫార్మర్ బద్దలయితే ఎలా ఉంటుందో అలా హెవీ యాక్షన్ తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది” అని అన్నారు

Show comments