NTV Telugu Site icon

Prabhas: ఆదిపురుష్ ఆల్ షోస్ హౌజ్ ఫుల్… అప్పుడే బోర్డు పెట్టేసారు

Prabhas

Prabhas

జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారుస్తూ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ హైప్డ్ మూవీ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో చిన్న సాంపిల్ చూపించిన ఓం రౌత్ ‘ఆదిపురుష్‌’ సినిమాతో వండర్స్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు 150 కోట్ల నుంచి మొదలవుతుంది అనే అంచనా వేస్తున్నారు. మొదటి రోజు అన్ని సెంటర్స్ కలిపి 150 కోట్ల గ్రాస్ ని ఆదిపురుష్ రాబడుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఇదే జరిగితే హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ ఉన్న హీరోగా ‘ఖాన్ త్రయాన్ని’ కూడా దాటి ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్ థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందని అంతా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ రోజు రోజుకీ ఆదిపురుష్ సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది.

నెల రోజుల క్రితం ఆదిపురుష్ సినిమాపై అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు, ఈరోజు ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల్ని మార్చే సినిమాగా ఆదిపురుష్ ప్రమోట్ అవుతోంది. లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డు పడింది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 18 వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో.. జూన్‌ 13న ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీమియర్ షోస్ కూడా పెంచారు. అయితే ఇప్పుడు జూన్ 13 ఉండాల్సిన షోని క్యాన్సిల్ చేసి.. జూన్ 15కి మార్చారు. ఈ ప్రీమియర్ షోస్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. మూడు వారాల ముందు టికెట్స్ అయిపోయాయి. ట్రిబెకా ఫెస్టివల్ వాళ్లు ఆదిపురుష్ సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేసారు. మరి జూన్ 16న ఇండియాలో ఆదిపురుష్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Show comments