NTV Telugu Site icon

Dil Se: బేబీ బాటలో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ‘దిల్ సే’గా ఆగస్టు 4న రిలీజ్!

Dil Se Release

Dil Se Release

Dil se set to release on augutst 4: ఈ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నాలుగున్నర కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 70 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి మరిన్ని వసూళ్లు సాధించేందుకు ముందుకు వెళుతోంది. ఇదిలా ఉండగా అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రవికుమార్ సబ్బాని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఆయన కథ అందించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. మంకల్ వీరేంద్ర మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ల పై నిర్మించారు.

Nani: సూపర్ స్టార్ తో నేచురల్ స్టార్?

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ ఆగస్ట్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇక నిజానికి ఈ మధ్య ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలవగా 2 మిలియన్ వ్యూస్ అందుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ మనసుకు హత్తుకునే సంగీతం అందించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని సినిమా యూనిట్ బలంగా చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోండడం గమనార్హం. అభినవ్ మేడిశెట్టి, స్నేహ సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

Show comments