Puneeth Rajkumar: ‘జేమ్స్’ ట్రేడ్‌మార్క్ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ సినిమాలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ‘జేమ్స్’ మూవీలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!