Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Vedaraju

Vedaraju

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు మృతి చెందారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఎ ఐ జి హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకుని వస్తారు అని సన్నిహితులు , కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగటం వారందరిలో విషాదాన్ని నింపింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు ఈ రోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వేదరాజు టింబర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, నటీనటుల సంతాపం ప్రకటించారు.

Exit mobile version