మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ‘టోవినో థామస్’. లూసిఫర్, ఫోరెన్సిక్, కల సినిమాలతో హీరోగా తనకంటూ సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకునే రేంజుకి ఎదిగిన ‘టోవినో థామస్’, ‘మిన్నల్ మురళి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఒక లో బడ్జట్ లో సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని దర్శకుడు చెప్పిన కథని నమ్మి సినిమా చేసిన ‘టోవినో థామస్’ మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్ట్ గా 2018 సినిమాతో మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టాడు. కేరళ రాష్ట్రంలో 2018లో వచ్చిన వరదల నేపధ్యంలో తెరకెక్కిన 2018 సినిమా కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. దీంతో ‘టోవినో థామస్’ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో బౌండరీలు దాటడానికి ప్రయత్నిస్తున్నాడు ‘టోవినో థామస్’. 2018 సినిమాని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయిన టోవినో, తన నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ లోకి దించుతున్నాడు.
‘టోవినో థామస్’ ప్రస్తతం ‘ARM'(Ajayante Randam Moshanam) అనే సినిమా చేస్తున్నాడు. ఈ పీరియాడిక్ డ్రామాని జతిన్ లాల్ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ని తెలుగులో నాని, కన్నడలో రక్షిత్ శెట్టి, హిందీలో హ్రితిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ లాంచ్ చేసారు. గ్రాండ్ విజువల్స్, స్టన్నింగ్ కెమెరా వర్క్, పర్ఫెక్ట్ సీజీ, సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టోవినో కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ARM టీజర్ ని చాలా స్పెషల్ గా మార్చాయి. ప్రతి ఫ్రేమ్ లో గ్రాండ్ గా ఉన్న ARM టీజర్ అన్ని భాషల్లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ ఇంకా లాక్ చెయ్యని ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ARM మూవీ పాన్ ఇండియా హిట్ అయితే కృతి శెట్టి కెరీర్ లో మళ్లీ గోల్డెన్ డేస్ వచ్చినట్లే.
This totally looks epic. Here’s the Teaser of #ARM (telugu) starring super talented @ttovino @IamKrithiShetty @aishu_dil wishing the team all the very best 🤗https://t.co/3W8f6toYGY
@jithin_lall @UGMMovies @magicframes2011
— Nani (@NameisNani) May 19, 2023
