చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమర్షియల్ సక్సెస్ అంటే కేవలం స్టార్ హీరోల చిత్రాలకే సాధ్యమనే నమ్మకం ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి కూడా ఊహించని రేంజ్‌కు దూసుకెళ్లింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు కూడా ఇప్పుడు వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హీరో యాక్షన్ ఫాంటసీ చిత్రం ‘లోకా‘ సరికొత్త చరిత్రను సృష్టించింది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ఈ చిత్రం ఏకంగా రూ. 302 కోట్ల ప్రపంచవ్యాప్త వసూళ్లతో సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాల్లో ఆల్‌టైమ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
మరోవైపు టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు నటించిన సరికొత్త యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు రాబట్టి తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్-లెడ్ మూవీగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన మొదటి 7 సౌత్ ఇండియన్ ఉమెన్-లెడ్ చిత్రాల వివరాలు:
-
లోకా – రూ. 302 కోట్లు ( మలయాళం)
-
మహానటి – రూ. 85 కోట్లు
-
మా ఇంటి బంగారం – రూ. 82 కోట్లు
-
రుద్రమదేవి – రూ. 81 కోట్లు
-
అరుంధతి –రూ. 68 కోట్లు
-
భాగమతి – రూ. 65 కోట్లు
-
సూక్ష్మదర్శిని – రూ. 54 కోట్లు ( మలయాళం)
ఈ కలెక్షన్ల లెక్కలను గమనిస్తే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల మార్కెట్ ఎంతలా విస్తరించిందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా అనుష్క శెట్టి నటించిన మూడు చిత్రాలు టాప్ 7లో ఉండటం స్టార్‌డమ్‌కు నిదర్శనం కాగా, ‘లోకాహ్’ మరియు ‘మా ఇంటి బంగారం’ వంటి సరికొత్త రికార్డులు నమోదు చేసాయి.

