బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘ఫోర్స్ 3’ తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి, ‘ఖాకీ, ది బీహార్ స్టోరీ’ లాంటి అద్భుతమైన సినిమాల డైరెక్టర్ భవ్ ధూలియా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్, రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ‘ఫోర్స్ 3’ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫేస్-ఆఫ్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్టర్ కోసం చూస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు.
Also Read : Bollywood : ఫ్లాప్ హీరొయిన్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆరడగుల సుందరి
‘ఫోర్స్ 1’ సినిమాలో జాన్, విద్యుత్ జమ్వాల్ మధ్య జరిగిన యాక్షన్ ఎపిసోడ్స్ లాగే, ‘ఫోర్స్ 3’ లో కూడా ఒక పవర్ ఫుల్ ఫేస్-ఆఫ్ చూపించబోతున్నారట. ఈసారి జాన్ అబ్రహం తన కొత్త అవతారంలో ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ భామ మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారట మేకర్స్. జాన్ అబ్రహం తో కలిసి మీనాక్షి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. అందులో 2011లో వచ్చిన ‘ఫోర్స్ 1’, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో జాన్ అబ్రహం ఒక హార్డ్ కోర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. డ్రగ్ మాఫియాతో తలపడి, తన స్టైలిష్ యాక్షన్ తో స్క్రీన్ ను షేక్ చేసాడు. ఈ స్టోరీలో జాన్ అబ్రహం పాత్ర యశ్ వర్ధన్. ముంబైలో డ్రగ్స్ స్మగ్లింగ్ ను కంట్రోల్ చేయడానికి వచ్చిన ఒక సిన్సియర్ ఆఫీసర్. అతని టీం లోని మిగతా ఆఫీసర్స్ ను చంపుతున్న ఒక డేంజరస్ గ్యాంగ్ స్టర్ ను పట్టుకోవడమే ఈ సినిమా కథ. ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎలా ఆ గ్యాంగ్ ను అంతం చేసాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. జాన్ అబ్రహం పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ ఈ సినిమా సక్సెస్ రీజన్.
