Site icon NTV Telugu

Nithiin : యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు

Nithiin

యంగ్ హీరో నితిన్ కు ‘భీష్మ’ తరువాత అంతటి హిట్ పడలేదని చెప్పాలి. నితిన్ నటించిన గత మూడు చిత్రాలు చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు పడింది. అది కూడా టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో !

Read Also : Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్ బాబు రివ్యూ

ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా నటీనటులు పాన్ ఇండియా సినిమాలతో హిందీలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో నితిన్ కూడా ఇప్పుడు హిందీ ప్రేక్షకుల హృదయాలను ఏలుతున్నాడు. ఇంకా స్ట్రెయిట్ హిందీ సినిమా చేయనప్పటికీ అక్కడ ఆయన విశేషమైన ఆదరణను మూటగట్టుకుంటున్నాడు. దక్షిణాది నుండి వివిధ ఛానెల్‌లలో తన హిందీ డబ్బింగ్ చిత్రాలకు కలిపి 2.3 బిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్ నితిన్. ఏ సౌత్ స్టార్‌కి ఇంతటి భారీ సంఖ్యలో వ్యూస్ రాలేదనే చెప్పాలి. జానర్‌తో, హిట్స్ ప్లాప్ లతో సంబంధం లేకుండా నితిన్ అన్ని హిందీ డబ్బింగ్ వెర్షన్ చిత్రాలకు వీక్షణలు ఎక్కువగానే ఉన్నాయి. నితిన్ సినిమా హిందీ రైట్స్ భారీ మొత్తాలను వసూలు చేయడంతో ఇది అతని నిర్మాతలకు ప్లస్‌గా మారింది.

Exit mobile version