NTV Telugu Site icon

Tollywood : టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్లపై టాలీవుడ్ చిన్నచూపు

Tollywood

Tollywood

స్టార్ హీరోల సినిమాలు  భారీ బడ్జెట్, క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే దేవీశ్రీప్రసాద్, తమన్ లేదా అనిరుధ్ పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ కంపోజర్స్ బిజీగా ఉన్నా, టైంకి ట్యూన్స్ ఇవ్వకపోయినా, వీరి వల్ల దర్శక నిర్మాతలు ఇబ్బంది పడినా పర్లేదు ఛాన్సులు ఇస్తూనే ఉంటారు. కానీ మంచి ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లపై అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్  మిక్కి జే మేయర్. హ్యాపీడేస్, మహానటి, రీసెంట్లీ వచ్చిన మిస్టర్ బచ్చన్ ఇవి చాలవా తన టాలెంట్ ఏంటో చెప్పడానికి  కానీ రీసెంట్ టైమ్స్‪లో భారీ ప్రాజెక్ట్ కానీ టాప్ హీరోతో అవకాశం రాలేదు.

Also Read : Dil Raju : రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలతో గేమ్ ఛేంజర్

ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్లకు కొదవ లేదు. అనూప్ రూబెన్స్ నుండి రీసెంట్‌గా ట్రెండ్ సృష్టిస్తున్న భీమ్ సిసిరోలియో వరకు బెస్ట్ ఆల్బమ్స్ ఇవ్వడమే కాదు సినిమాను హిట్ బాట పట్టిస్తున్నారు. పాటలను చార్ట్ బస్టర్లుగా నిలిపారు. సాంగ్సే కాదు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కూడా సినిమాను నిలబెట్టిన కంపోజర్స్. కానీ భారీ బడ్జెట్ చిత్రాల విషయానికి వచ్చే సరికి వీరు కనిపించడం లేదు. శేఖర్ చంద్ర, శ్రీ చరణ్ పాకాల, చైతన్య భరద్వాజ్, వివేక్ సాగర్ వీరంతా చార్ట్ బస్టర్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించారు కానీ గ్రేడ్ 2, 3 కంపోజర్లుగా మిగిలిపోయారు.

Also Read : GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్

థమన్, దేవీ శ్రీ బిజీ అంటే అనిరుధ్ ఈ ముగ్గురి కాల్షీట్స్ ఖాళీ లేకుంటే నో అనదర్ ఛాయిస్. బ్యాక్ డోర్ కంపోజర్లకు ఫోన్స్ కొడుతున్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా నైబర్‌హుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్లకు పెద్ద పీట వేస్తున్నారు. కన్నడ నుండి రవి బస్రూర్, అంజనీష్ లోక్ నాథ్, మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహబ్, కోలీవుడ్ నుండి సంతోష్ నారాయణన్, జీవి ప్రకాష్ లాంటి కంపోజర్లతో పని చేయించుకుంటున్నారు. మన మ్యూజిషన్స్ మ్యాజిక్ చేయగలరో లేదో తెలియాలంటే. పెద్ద ప్రాజెక్టులైనా, బడా హీరోలైనా ఛాన్స్ ఇవ్వాలిగా. అప్పుడే కదా తమ టాలెంట్ ఏంటో ఫ్రూవ్ చేయగలరు.