Site icon NTV Telugu

Tollywood: సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కన్నుమూత!

Director Aditya

Director Aditya

Tollywood Senior Director K Aditya Passes Away: సీనియర్ దర్శకులు కె. ఆదిత్య సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ తో ఎం. నాగేశ్వరరావు నిర్మించిన ‘నవయుగం’ చిత్రానికి ఆదిత్య దర్శకత్వం వహించారు. దానికి ముందు సీనియర్ నిర్మాత కె. రాఘవ నిర్మించిన ‘యుగకర్తలు’ (రాజశేఖర్, జీవిత), ‘ఈ ప్రశ్నకు బదులేది?’ (రాజశేఖర్, జయచిత్ర) సినిమాలకు కూడా ఆయన డైరెక్షన్ చేశారు. పలు చిత్రాలకు రచన చేశారు. కొన్ని సినిమాలలో నటించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కె. ఆదిత్య మరణం చిత్రసీమకు తీరని లోటు అని సీనియర్ రచయిత, దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. తెలుగు సినీ రచయితల సంఘం కార్య నిర్వాహక సభ్యునిగా ఆయన తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. కె. ఆదిత్య మృతికి ప్రజానాట్యమండలి సినిమా శాఖ సైతం సంతాపం తెలిపింది.

Exit mobile version