NTV Telugu Site icon

Tollywood: చిత్రసీమలో డబుల్ థమాకా!

Holi

Holi

Holi And Women’s day: సహజంగా ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు మన దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేస్తుంటారు. అయితే… ఈ సారి మార్చి 8వ తేదీ అయిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా వచ్చింది. దాంతో ఇది చిత్రసీమకు డబుల్ ధమాకాలా మారిపోయింది. ఓ పక్క తమ చిత్రాలలోని కథానాయికలను మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ, యూనిట్ తో పాటు ఆడియెన్స్ కు హోలీ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నారు. కొంతమంది నిర్మాతలు ఈ స్పెషల్ డే ను పురస్కరించుకుని గ్లిమ్స్ ను, టీజర్స్ ను రిలీజ్ చేస్తున్నారు.
Holi1 ]

ఇదిలా ఉంటే… పాన్ ఇండియా స్టార్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న ‘శాకుంతలం’ వరల్డ్ వైడ్ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఇవాళ మహిళాదినోత్సవం కావడంతో సమంత లుక్ తో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అలానే ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా పేరున్న కథానాయికే. ఇప్పటికే 49 చిత్రాలలో నటించిన ఆమె ప్రస్తుతం 50వ చిత్రంగా ‘డిటెక్టివ్ తీక్షణ’ చేస్తోంది. ఉమెన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను ఆ చిత్రబృందం కూడా విడుదల చేసింది. తమిళనటే అయినా… శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఇప్పుడు బహుభాషా నటిగా, పాన్ ఇండియా ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఆమె నటిస్తున్న ‘శబరి’ మూవీ నుండి కూడా ఓ స్పెషల్ పోస్టర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైంది. అలానే ‘భుజనవిజయం’ మూవీ యూనిట్ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ‘రామబాణం’ మూవీ టీమ్ హీరోయిన్ డింపుల్ హయతీ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే… ‘అధర్వ’, ‘గేమ్ ఆన్’, ‘కృష్ణగాడు అంటే ఓ రేంజ్’ చిత్ర బృందాలు హోలీ సందర్భంగా విషెస్ తెలిపాయి. టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థలు చాలా వరకూ హోలీ, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్స్ ను విడుదల చేశాయి. మొత్తం మీద సోషల్ మీడియా అంతా ఈ స్పెషల్ పోస్టర్స్ తో కలర్ ఫుల్ గా మారిపోయింది.