Site icon NTV Telugu

Tollywood: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా కొల్లి రామకృష్ణ!

Tfcc

Tfcc

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గత డిసెంబర్ నుండి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 19న ఆయన కన్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిమ్ ఛాంబర్ కార్యవర్గం సమావేశమైంది. ఛాంబర్ నియమ నిబంధనలను అనుసరించి, ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (రిథమ డిజిటల్ థియేటర్స్ అధినేత)ను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. కొల్లి రామకృష్ణ పదవి కాలం ఈ యేడాది జూలై 31 వరకూ ఉంటుందని ఛాంబర్ కార్యదర్శులు కె. ఎల్. దామోదర ప్రసాద్, ఎం. రమేశ్ తెలిపారు.

Exit mobile version