NTV Telugu Site icon

Tollywood Heroines : సోలోగా ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోయిన్స్ వీళ్లే…

Heroines

Heroines

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.. టాలీవుడ్ లో చాలామంది హీరోలు వాళ్ల స్టార్ డమ్ ను చూపించుకుంటూ పైకి ఎదిగిన వారే..స్టార్ హీరోలు బీభత్సమైన స్టార్ డమ్ తో ముందుకు దూసుకెళ్తుంటే.. వారికి పోటి ఇచ్చేలా ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం సోలోగా హీరో లేకుండానే హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు.. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒసేయ్ రాములమ్మ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్ విజయశాంతి. ఇండస్ట్రీ లో ఇప్పుడున్న పరిస్థితి వేరు, కానీ అప్పుడు మాత్రం హీరో లేకుంటే సినిమా థియేటర్ కి జనాలు వచ్చే వాళ్ళు కాదు. కేవలం స్టార్ హీరోల సినిమాలనే చూసేవారు.. అలాంటి రోజుల్లో కూడా ఆమె సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమాతో హిట్ కొట్టడమే కాదు.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది..ఈ సినిమా తర్వాత ఆమె దాదాపు ఒక పది సినిమాల వరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసిందంటే ఆమె రేంజ్ ఎంతలా పెరిగిందో చెప్పనక్కర్లేదు..

ఇకపోతే అరుంధతి సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది అనుష్క శెట్టి.. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా విజయశాంతి తర్వాత ఆ రేంజ్ లో మన స్టార్ హీరోలకి వెన్నులో వణుకు పుట్టించిన హీరోయిన్ అనుష్క. ఒక మంచి కథ ఉంటే చాలు సినిమాలో హీరో ఉండాల్సిన అవసరం లేదని నిరూపించిన ఈ రెండు సినిమాలు, ఆ హీరోయిన్లు ఎప్పటికి సినీ చరిత్రలో ప్రత్యేక స్థానంలోనే ఉంటారు.. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే మరొకరు సినిమాల్లో బిజీగా ఉన్నారు..