NTV Telugu Site icon

Heroines: రూట్ మార్చిన హాట్ బ్యూటీస్… దెబ్బకు షేక్ చేస్తున్నారే!

Reppal Dappul

Reppal Dappul

Tollywood Heroines Focusing on Dance Numbers: సినిమాలో హీరోయిన్ అంటే అందం, అభినయం ఉంటే సరిపోదు. అంతకు మించి టాలెంట్ చూపించాలి. గ్లామర్ షో చేస్తూ మాస్ స్టెప్పులు వేస్తూ ధియేటర్స్ ని షేక్ చేయాలి. అప్పుడే మేకర్స్ చూపు తమపై పడుతుంది. కెరీర్ బిగినింగ్ లోనే ఈ పాయింట్ ని క్యాచ్ చేశారు కుర్ర కట్టిస్. డ్యాన్స్ తోనే క్రేజీ ఛాన్సులు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో తమన్నా, సమంత, కాజల్ లాంటి సీనియర్ బ్యూటీస్ డాన్స్ తో మ్యాజిక్ చేశారు.ఊరమాస్ స్టెప్స్ తో థియేటర్స్ ని షేక్ చేశారు. ఇప్పుడు వాళ్ల బాటలోనే ట్రావెల్ చేస్తున్నారు కుర్ర కుట్టిస్. పుష్ప లో రారా సామీ అంటూ రష్మిక వేసిన స్టెప్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. వారసుడులో రంజితమే సాంగ్ లో నేషనల్ క్రష్ చూపించిన గ్రేస్ భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు పుష్ప2 లోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయనుంది.

Jr NTR : మూడేళ్లు నో డేట్స్!!

అదే విధంగా గుంటూరు కారంలో మహేష్ తో కలిసి మాస్ స్టెప్స్ వేసింది శ్రీలీల. కుర్చీ ని మడతపెట్టి సాంగ్ తో నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. భాషతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఆ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెప్పల్ డప్పుల్ల సప్పుళ్లు కొట్టాలిలే.. అంటూ భాగ్యశ్రీ బోర్సే వేసిన స్టేప్స్ కి ప్రేక్షకులు వన్స్ మోర్ ….అంటూ అల్లరి చేశారు. ఇక మరోపక్క దేవరతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. దాపూదీ సాంగ్ లో మంచి డ్యాన్స్ ని ప్రజెంట్ చేసింది. డిఫరెంట్ సబ్జెట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్న సాయి పల్లవి కూడా డాన్స్ తోనే ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. మొత్తానికి కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అలాంటప్పుడు పాటలతోనే ఆడియన్స్ ని కట్టి పడేయాలి. కెరీర్ బిగినింగ్ లోనే ఈ విషయాన్ని పసిగట్టి…అందుకు తగ్గట్టుగా తమ ప్లాన్స్ ని అప్లై చేస్తున్నారు హాట్ బ్యూటీస్. అలా రూట్ మార్చిన హాట్ బ్యూటీస్… దెబ్బకు షేక్ చేస్తున్నారే అనిపిస్తూ దూసుకుపోతున్నారు.

Show comments