టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్స్‌తో బాక్సాఫీస్‌ను ఏలిన పలువురు స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కించిన ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో తమ తదుపరి చిత్రాలను ఏ హీరోతో చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. ఎంతటి క్రేజీ కాంబినేషన్లయినా కంటెంట్ సరిగా లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తుండటంతో ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం వెనకడుగు వేస్తున్నారు.
ఉప్పెన విజయం తర్వాత బుచ్చిబాబు సానా నుంచి వచ్చిన ‘పెద్ది’ చిత్రం తెలుగు వెర్షన్‌లో ఎలాగోలా బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో బుచ్చి తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోవైపు ‘ది రాజా సాబ్’తో ప్రభాస్‌ను కనీవిని ఎరుగని రీతిలో చూపిస్తానన్న మారుతి, సినిమా ఫలితం చూసి విమర్శల పాలయ్యారు. కథ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకు సరైన హీరో దొరకడం లేదు. దీంతో మళ్లీ తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమా వైపే ఆయన మొగ్గు చూపుతారా అనే చర్చ నడుస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో తీసిన ‘ఫ్యామిలీ స్టార్’ దారుణమైన ఫ్లాప్‌గా మారడంతో దర్శకుడు పరశురామ్‌కు ఇప్పటివరకు మరొక అవకాశం ఇచ్చేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు. హీరోలకు సరిపడే బలమైన కథలను సిద్ధం చేసుకుని, ప్రేక్షకుల తాజా మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ శైలిని మార్చుకుంటేనే ఈ దర్శకులు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

