NTV Telugu Site icon

Tollywood Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో హీరో నవదీప్

Navadeep

Navadeep

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మొరసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతోమంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు పక్కాగా వలపన్ని ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్ల సహాయంతో సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తూ పలువురికి విక్రయిస్తున్నారట. ఇక ఈ డ్రగ్స్ కేసుపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ప్రెస్ మీట్ పెట్టి.. నిందితుల గురించి మీడియాకు తెలిపారు.

Big Breaking: కోలీవుడ్ లో సంచలనం.. ధనుష్ తో సహా ఆ హీరోలపై బ్యాన్ విధించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్

“టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఉన్నా వాళ్లు బయటకు వస్తున్నారు. తాజాగా మదాపూర్లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాము.. అందులో ఐదుగురిని అరెస్టు చేసి వారివద్ద ఉన్న సెలఫోన్లు సీజ్ చేసాం. ఈ కేసులో మొత్తం డ్రగ్స్ బెంగుళూరు నుండి వచ్చిందనితెలిసింది .. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. నైజీరియన్లు వీసా గడవు ముగిసిన దేశంలో ఉన్నారు.. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్ చెందిన వ్యక్తి ఉన్నారని సమాచారం.. సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు. మాజీ ఎంపీ కూమారుడు దేవరకొండ సురేష్ రావు అరెస్ట్ చేశాం.. హీరో నవదీప్ కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించాం.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. త్వరలోనే వారిని పట్టుకుంటాం” అని ఆయన తెలిపారు.