Site icon NTV Telugu

The Goat Life: తెలుగు డైరెక్టర్‌లకి ‘ది గోట్ లైఫ్’ ప్రీమియర్ షో.. అదిరిందట బాసూ!

The Goat Life

The Goat Life

Tollywood directors lauded The Goat Life in celebrity premiere: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోండగా తాజాగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షోను పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ చూసి అద్భుతమైన సినిమా చూశామంటూ ప్రశంసించారు. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షోకి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, దర్శకులు హను రాఘవపూడి, అజయ్ భూపతి, శివ నిర్వాణ, పి.మహేశ్ బాబు, ప్రవీణ్ సత్తారు, శ్రీను వైట్ల, కిషోర్ తిరుమల, చంద్రసిద్ధార్థ్ హాజరయ్యారు.

Barrelakka: కాబోయే భర్తతో వీడియో వదిలిన బర్రెలక్క.. ఎవరో, ఎలా ఉన్నాడో చూశారా?

జీవితంలో ఒక సారే ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం వస్తుందని, ఈ సినిమాకు అన్ని అవార్డ్స్ దక్కుతాయని సెలబ్రిటీలు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా మీద ప్రశంసలు కురిపించారని సినిమా యూనిట్ వెల్లడించారు. ఇది ఒక బెస్ట్ సర్వైవల్ మూవీ అని, ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్ కు హ్యాట్సాప్ చెబుతూ కొన్ని ఏళ్లపాటు ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ అవడం సాధారణ విషయం కాదని హీరోని అభినందించారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

Exit mobile version