Site icon NTV Telugu

దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం

Sreenuvaitla

Sreenuvaitla

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీను వైట్ల తండ్రి ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల తండ్రి పేరు వైట్ల కృష్ణారావు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందుల పాలెంలో నివసిస్తున్నారు ఆయన. శ్రీను వైట్ల మాత్రం ఫ్యామిలీతో సినిమాల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణారావు ఈరోజు ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. ఈ వార్త విన్న శ్రీను వైట్ల ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడికి బయల్దేరింది. శ్రీను వైట్లకు పితృవియోగం అనే బాధాకరమైన వార్త విన్న సినీ ప్రముఖులు ఆయనకు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also : నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త … త్వరలో భక్తి టీవీ స్టార్ట్

కాగా శ్రీనువైట్ల ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 2011లో దూకుడు, 2013లో బాద్షా వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శ్రీను వైట్ల ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం పలకరించలేదు. ‘ఢీ అంటే ఢీ’ సినిమాపై శ్రీను వైట్ల ఆశలన్నీ పెట్టుకున్నారు.

Exit mobile version