Site icon NTV Telugu

RIP Goutham Reddy : సినీ ప్రముఖుల సంతాపం

Gautham-Reddy

వైయస్సార్పీ నేత, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. గౌతం రెడ్డి మృతి వార్త విని సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి గౌతంరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈరోజు జరగాల్సిన తన సినిమా #BheemlaNayakPreReleaseEvent ను వాయిదా వేసుకున్నారు. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు గౌతం రెడ్డి మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటున్నారు.

Read Also : PawanKalyan : ‘విషాద సమయంలో వేడుక… మనస్కరించట్లేదు

https://twitter.com/harish2you/status/1495650810121883655
Exit mobile version