Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర జరిగినప్పటికీ ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంది. సతీ లీలావతి, రేజర్, M4M, గోదారి గట్టుపైన వంటి చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ అంచనాలు లేకపోయినా కనీస వసూళ్లనైనా సాధిస్తాయని ఆశించిన ట్రేడ్ వర్గాలకు ఈ సినిమాలు షాక్ ఇచ్చాయి.
సాధారణంగా వేసవి సెలవుల సీజన్ కావడంతో చిన్న సినిమాలకు ఇది మంచి అవకాశమని భావిస్తారు. కానీ ఈ వారం విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రమోషన్స్ లో కాస్త హడావిడి చేసిన గోదారి గట్టుపైన సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరక్కేకగా కమెడియన్ సుదర్శన్ కొంత మేర నవ్వించిన అది వసూళ్ల రూపంలోకి మారలేదు. రేజర్ & M4M ఈ రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో అసలు ఎందుకు వచ్చాయో కూడా తెలియని విధంగా బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దంగా మిగిలిపోయాయి.పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చాలా చోట్ల కనీసం పోస్టర్ ఖర్చులు మరియు పబ్లిసిటీ వ్యయం కూడా రాబట్టలేక ఈ సినిమాలు చతికిలపడ్డాయి. ముఖ్యంగా బి, సి సెంటర్లలోని థియేటర్లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీస ప్రేక్షకులు లేకపోవడంతో చాలా చోట్ల మార్నింగ్ షోలు మరియు మ్యాట్నీలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాలు లేని ఈ సమయాన్ని వాడుకోవడంలో చిన్న చిత్రాల మేకర్లు విఫలమయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!