Site icon NTV Telugu

Tollywood Biggies : అగ్ర దర్శకులతో అగ్ర తారలు.. అరుదైన ఫొటో..

Tollywood

Tollywood

Tollywood Biggies :ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో చాలా అరుదైనది. ఈ ఫొటోకు చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లెజెండ్స్ ఈ ఫొటోలనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని తమ నట విశ్వరూపంతో శాసించిన స్టార్లు వీరే. అసలు టాలీవుడ్ లో స్టార్ బిరుదులు మొదలైంది కూడా ఈ ఫొటోలో ఉన్న వారితోనే. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, అప్పటి స్టార్ హీరోలు శోభన్ బాబు, మురళీమోహన్ తో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా ఉన్నారు.
Read Also : Extramarital Affairs: పెరిగిపోతున్న ఇల్లీగల్ ఎఫైర్స్.. భర్తలనే చంపేస్తారా..?

ఇందులోనే కృష్ణ పక్కన విజయనిర్మల కూడా ఉన్నారు. ఇంకో పక్క ఓ నటి కూడా ఉన్నారు. ఈ ఫొటో చూస్తుంటే వీరంతా ఇండస్ట్రీలో అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలాగా అనిపిస్తోంది. అందరూ చాలా యంగ్ లుక్ లో ఉన్నారు. ఇది సినిమా ఫంక్షన్ లాగా కనిపిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు పక్కన నటి ఉంది కాబట్టి చూస్తుంటే ఆయన సినిమా ప్రారంభ కార్యక్రమం లాగా అనిపిస్తోంది. ఏదేమైనా ఈ అరుదైన ఫొటో అప్పట్లో హీరోలు అందరూ ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారో చూపిస్తోంది. ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ ఈ ఫొటోలో మాదిరిగా కనిపిస్తే నిజంగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవాలి.

Exit mobile version