Site icon NTV Telugu

Tollywood n Kollywood: ఇక్కడ మూడు! అక్కడ మూడు!!

Kollywood

గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’. నవీన్ పోలిశెట్టి హీరోగా గతంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీని తెరకెక్కించి స్వరూప్ ఈ సినిమాకు దర్శకుడు కావడం, మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ దీన్ని నిర్మిస్తుండటంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై జనాలలో కొద్ది పాటి ఆసక్తి నెలకొంది.

Read Also : Tirumala : శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖులు

ఇక శుక్రవారం విడుదల కాబోతున్న మరో సినిమా ‘సేవాదాస్’. దేశవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దాంతో వారి ఆరాధ్య దైవమైన సేవాలాల్ ఇతివృత్తాన్ని బంజారా భాషలో ‘సేవాదాస్’ పేరుతో తన మిత్రులతో కలిసి సినిమాగా తీశారు బాబూ చౌహాన్. ఇటీవల కాలంలో బంజారా చిత్రాలు సైతం తెలుగునాట రూపుదిద్దుకుంటున్నాయి. ఇదీ అదే తరహా సినిమా. సుమన్, భానుచందర్ వంటి సీనియర్ నటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇక ఫ్రైడే వస్తున్న మరో చిత్రం ‘మోర్బియస్’. జారెడ్ లెటో, మాట్ట్ స్మిత్, జారెడ్ హర్రిస్ ప్రధాన పాత్ర‌లు పోషించిన ఈ సినిమాను మార్వెల్ కామిక్స్‌ను బేస్ చేసుకొని డానియ‌ల్ ఎస్పినొస తెర‌కెక్కించాడు. సూప‌ర్ హీరో ఫాంట‌సీలో ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చ‌ర్స్, మార్వెల్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మించాయి. యాక్ష‌న్ అడ్వంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ‘మోర్బియస్’ ఏప్రిల్‌1న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. తెలుగులోనూ డబ్ చేసి ఈ మూవీని విడుదల చేస్తున్నారు.

Exit mobile version