Tollywood n Kollywood: ఇక్కడ మూడు! అక్కడ మూడు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’. నవీన్ పోలిశెట్టి హీరోగా గతంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీని తెరకెక్కించి స్వరూప్ ఈ సినిమాకు దర్శకుడు కావడం, మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ దీన్ని నిర్మిస్తుండటంతో సహజంగానే ఈ ప్రాజెక్ట్ పై జనాలలో కొద్ది పాటి ఆసక్తి నెలకొంది.
Read Also : Tirumala : శ్రీవారి సన్నిధిలో టాలీవుడ్ ప్రముఖులు
Also Read
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
- Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ఇక శుక్రవారం విడుదల కాబోతున్న మరో సినిమా ‘సేవాదాస్’. దేశవ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దాంతో వారి ఆరాధ్య దైవమైన సేవాలాల్ ఇతివృత్తాన్ని బంజారా భాషలో ‘సేవాదాస్’ పేరుతో తన మిత్రులతో కలిసి సినిమాగా తీశారు బాబూ చౌహాన్. ఇటీవల కాలంలో బంజారా చిత్రాలు సైతం తెలుగునాట రూపుదిద్దుకుంటున్నాయి. ఇదీ అదే తరహా సినిమా. సుమన్, భానుచందర్ వంటి సీనియర్ నటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇక ఫ్రైడే వస్తున్న మరో చిత్రం ‘మోర్బియస్’. జారెడ్ లెటో, మాట్ట్ స్మిత్, జారెడ్ హర్రిస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్వెల్ కామిక్స్‌ను బేస్ చేసుకొని డానియల్ ఎస్పినొస తెరకెక్కించాడు. సూపర్ హీరో ఫాంటసీలో ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, మార్వెల్ ఎంటర్ టైన్ మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘మోర్బియస్’ ఏప్రిల్1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. తెలుగులోనూ డబ్ చేసి ఈ మూవీని విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!