స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “పుష్ప” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ వన్”ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో మరో టాలీవుడ్ విలన్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
Read Also : మరోసారి వెండితెరపై “గబ్బర్ సింగ్”… ఏకంగా 100 షోలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు అజయ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అట. బజ్ ప్రకారం “పుష్ప”లో అల్లు అర్జున్ సోదరుడుగా అజయ్ కనిపించనున్నాడు. గతంలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన “ఆర్య 2″లో అజయ్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో బన్నీ, అజయ్ మధ్య వచ్చిన సన్నివేశాలకు టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తరువాత వరుసగా స్టార్స్ సినిమాల్లో నటించిన అజయ్ ఇటీవల కాలంలో కాస్త వెనుకబడ్డాడు. మళ్ళీ బన్నీ “డీజే” సినిమాలో కూడా కన్పించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో అజయ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం అజయ్ కి భారీ మేకోవర్ ఉంటుందని టాక్. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, మొదటి సాంగ్ కు విశేష స్పందన వచ్చింది.