Daaku Maharaaj : నేడే డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ఎంప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read : Ram Charan : ఆ సినిమా చేసినందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నా : రామ్ చరణ్
Also Read
కాగా నేడు ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్ నారా లోకేష్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన బోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమానుండి మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట టీమ్. ఈ సారి పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా మరో సాంగ్ ను డైరెక్ట్ గా థియేటర్ లో రిలీజ్ చేయనున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండంగా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!