Site icon NTV Telugu

Kiran Abbavaram: సీమ కుర్రాడు తిరిపతి పాటని ఎత్తుకున్నాడు…

Kiran Abbavaram

Kiran Abbavaram

సీమ నుంచి వచ్చి యంగ్ ప్రామిసింగ్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ ని కొట్టి ఇండస్ట్రీలో తన ప్లేస్ లో పక్కాగా సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది మాత్రం కిరణ్ అబ్బవరంకి అందని ద్రాక్షాగానే ఉంది. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోని, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లు అయితే చేస్తున్నాడు కానీ కథల విషయంలో కిరణ్ అబ్బవరం క్లారిటీ మిస్ అవుతున్నాడు అనే కామెంట్స్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరో రెండు ఫ్లాప్స్ పడితే కిరణ్ అబ్బవరం కెరీర్ కష్టం అనుకుంటున్న సమయంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాని సైన్ చేశాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే ఉన్న పాజిటివ్ వైబ్స్ టీజర్ తో మరింత పెరిగాయి, ఇటివలే ట్రైలర్ తో హిట్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని మూవీ లవర్స్ లో క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. ఇదే జోష్ ని రిలీజ్ డేట్ వరకూ మైంటైన్ చెయ్యాలి అంటే ప్రమోషనల్ కంటెంట్ బ్యాక్ టు బ్యాక్ బయటకి రావాలి.

ఈ స్ట్రాటజీనీ మైంటైన్ చెయ్యడంలో సక్సస్ అవుతున్న గీత ఆర్ట్స్ 2 ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా నుంచి నాలుగో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఈ  మూవీ నుంచి ‘తిరుపతి సాంగ్’ని రిలీజ్ చెయ్యనున్నారు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ఈవెంట్ చేస్తున్న మేకర్స్, ఈ తిరుపతి సాంగ్ లాంచ్ ని కూడా ఈవెంట్ చేసి లాంచ్ చేస్తున్నారు. తిరుపతిలోని ‘ఇందిరా మైదానం’లో సాంగ్ లాంచ్ ఈవెంట్ ని చేస్తున్నారు. మరి సీమ కుర్రాడు తిరుపతి ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యబోయే ‘తిరుపతి సాంగ్’ ఎలా ఉంటుందో చూడాలి అంటే ఈవెనింగ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఇదిలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 18కి వాయిదా పడింది అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Exit mobile version