NTV Telugu Site icon

Custody: ఈ ఒక్క సాంగ్ తో మూవీ కలర్ మారిపోయింది…

Custody

Custody

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. నాగ చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటివలే టీజర్ తో మంచి హైప్ తెచ్చిన మేకర్స్, ఇప్పుడు కస్టడీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న కస్టడీ సినిమా నుంచి ‘టైం లెస్ లవ్’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. రెట్రో స్టైల్ లో డిజైన్ చేసిన ఈ సాంగ్ కంపోజిషన్ వింటేజ్ ఇళయరాజా స్టైల్ లో సాగింది. ఇళయరాజా కంపోజిషన్ లోని మ్యాజిక్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మరింత ఎస్సెట్ గా నిలిచాయి.

యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ సాంగ్ విజువల్స్ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. నాగ చైతన్య, కృతి శెట్టి జంట చూడడానికి చాలా బాగుంది. సెట్ డిజైన్, హీరో-హీరోయిన్ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టీల్స్ అన్నీ రెట్రో స్టైల్ లో ఉండడంతో ‘టైం లెస్ సాంగ్’ని మరింత స్పెషల్ గా మార్చాయి. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి సాంగ్ ని బ్యుటిఫుల్ గా మార్చిందనే విషయం, లిరికల్ వీడియోలో అక్కడక్కడ ప్లే చేసిన విజువల్స్ ని చూస్తేనే అర్ధమవుతుంది. ఇప్పతోవరకూ యాక్షన్ సినిమా, సీరియస్ డ్రామాగా మాత్రమే ప్రమోట్ అవుతూ వచ్చిన కస్టడీ సినిమా కలర్ ని ఈ సాంగ్ మార్చేసింది. ఈ ఒక్క సాంగ్ తో కస్టడీ సినిమా కొత్త వైబ్స్ ని సృష్టించింది. మరి మే 12న నాగ చైతన్య కస్టడీ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో హిట్ అవుతుందో లేదో చూడాలి.

 

Show comments