Site icon NTV Telugu

Sarakaru Vaari Paata: సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్ కి సిద్ధం కండి..

Svp

Svp

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూ ఇస్తున్న విషయం తెల్సిందే. మరో పక్క సోషల్ మీడియా లో కూడా జోరు పెంచిన మేకర్స్ ట్రైలర్ డేట్  ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాపై భారీ అంచనాలను కు రేకెత్తిస్తున్నాయి.

సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ్   రేపు సాయంత్రం 4.05 లకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఒక చిన్న వీడియోను జత చేశారు. ఈ వీడియోలో సూపర్ స్టార్ మెంటల్ మాస్ స్వాగ ను శాంపిల్ గా చూపించారు.  సూపర్ స్టార్ కి చెందిన 105 మాస్ షాట్స్ ని చూపించనున్నామని తెలపడంతో ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా..? మహేష్ వింటేష్ మాస్ స్టైల్ ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version